దసరెల్లంగనే దంచుడే..
పండుగే డెడ్ లైన్
మాఫీ కోసం రాహుల్ ఇంటిదగ్గర ధర్నా
రైతు భరోసా ఇవ్వకుంటే బడిత పూజ
తొర్రూరు ధర్నాలో హరీష్
దసరా తర్వాత బిఆర్ఎస్ ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని, రైతు కేంద్రంగా ఉద్యమాలు ఉంటాయని మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నాలో హరీష్ రావు పాల్గొన్నారు. మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ
పది నెలల పాలనలో రేవంత్ రెడ్డి కి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదన్నారు.
మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నడు. డిసెంబర్ 9 అన్నడు. ఆగష్టు 15 అన్నడు.
కొమిరెల్లి మల్లన్న, యాదాద్రి , భద్రాద్రి, సమ్మక్క సారలమ్మ మీద ఒట్టు పెట్టీ మొనగాడు లెక్క మాట్లాడిండు.
మొనగాడు కాదు మోసగాడు అని తేలిపోయింది.
రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్ని చేస్తా అన్నాడు. ఇప్పుడు సపుడు లేదు.
మొత్తం రుణమాఫీ అయ్యింది రాజీనామా చెయ్యి హరీష్ రావు అని సవాల్ విసిరిండు
రుణమాఫి అయితే ఎందుకు ఇంత మంది వచ్చారు.
పాలకుర్తి మండలం లోనే 4314 మందికి రుణమాఫీ కాలేదు.
మంత్రి తుమ్మలె 22 లక్షల మందికి మాఫీ చేశా. మిగతా వారికి కాలేదు అన్నడు.
చెప్పిన 22 లక్షల మందిలో కూడా రుణమాఫీ కాలేదు.
రుణ మాఫీ కాలేదు అంటే, పెళ్లి కాలేదు అంటున్నారట, 31 సాకులు పెట్టీ ఎగవెట్టే ప్రయత్నం చేసిండు అని హరీష్ రైతులకు అర్థమయ్యేలా మండిపడ్డారు.
రేవంత్ మోసగాడు అని రైతులు, ప్రజలు అంటున్నారనీ అన్నారు.
కర్ణాటక 5, తెలంగాణ 6 గ్యారెంటీలు పెట్టారు. హర్యానాలో 7 గారటీలు అన్నారనీ ఇందులో ఒక్కటి అమలు కాలేదని చెప్పారు.
ఏమైంది డిక్లరేషన్
—–
వరంగల్ వచ్చి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు.
భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15 వేలు అన్నడు. కాలేదు
భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు అన్నడు కాలేదు
రైతు కూలీలు, భూమి లేని రైతులకు పంట బీమా పథకం అన్నడు. కాలేదు
పోడు, అసైండ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తా అన్నడు. కాలేదు
అన్ని రకాల పంటలకు 500 బోనస్ అని, ఇప్పుడు సన్నాలకి మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నడు. కాలేదు
ఏమైందీ అందులో చెప్పినవి. రేవంత్ రెడ్డి దయ వల్ల రాహుల్ గాంధీ మీద నమ్మకం లేకుండా పోతుంది.
వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదనీ హరీష్ రావు ప్రశ్నించారు.
రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తున్నది.
హైడ్రాతో అరాచకం….
హైదరా పేరుతో హైదరాబాదులో అరాచకాలు చేస్తున్నారని మంత్రి హరీష్ ధ్వజమెత్తారు. మూసిని ఆనుకొని ఉన్న పేదల ఇళ్ళ్ళు కూల గొడితే ఊరుకోం అని హెచ్చరించారు.
లేదు.
కరోనా సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపి రైతులకు మాత్రం రైతుబంధు కెసిఆర్ ఆపలేదని,
రైతు గుండె కేసీఆర్ ది. అందుకే రైతు బంధు రైతు బీమా రుణమాఫీ చేసిండనీ,
అన్ని పంటలకు బోనస్ అని ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తున్నారు.
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి.
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నడు. ప్రజల సమస్యలు పక్కకు పోవాలని
ప్రభుత్వం చేసిన మోసాలను ప్రతిపక్షంగా వెంటపడి అడుగుతాం
ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నడు. పది నెలల్లో ఎన్ని ఇచ్చినవ్. అని హరీష్ ప్రశ్నించారు