Faf duplessis| గత రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కి చేరింది. ప్లేఆఫ్ చేరాలి అంటే 18 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలవాలి లేదంటే చెన్నైను 200 పరుగులు అంత కంటే తక్కువకే కట్టడి చేయాలి. అయితే ఇది అసాధ్యమే అని, చెన్నై ప్లేఆఫ్స్‌కి వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. కాని బెంగళూరు ఏకంగా 27 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. అయితే మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.. ఓపెనర్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 47 పరుగులు; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (39 బంతుల్లో 54 పరుగులు; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మంచి ఆరంభం ఇచ్చారు.
10వ ఓవర్లో మిచెల్ సాంట్నర్ బౌలింగ్‍లో విరాట్ కోహ్లీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కోహ్లీ ఔటైనా డుప్లెసిస్ చెలరేగి ఆడుతూ 35 బంతుల్లో అర్ధ శకతం చేశాడు. ఆ తర్వాత ఊహించని రనౌట్‌తో డుప్లెసిస్ పెవీలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఇన్నింగ్స్‌లో భాగంగా 13వ ఓవర్ మిచెల్ శాంట్నర్ వేయగా, ఇన్నింగ్స్ చివరి బంతిని రజత్ పటీదార్ స్ట్రైట్‌గా కొట్టాడు. ఆ సమయంలో బంతి శాంట్నర్ చేతి వేళ్లని తాకుతూ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న వికెట్స్‌ని గిరాటేసింది. ఆ సమయంలో చెన్నై ఆటగాళ్లు రనౌట్ అప్పీల్ చేయగా, థర్డ్ అంపైర్‌కి ఇచ్చారు. రిప్లేలో బంతి వికెట్లని తాకే సమయానికి బ్యాటు క్రీజులోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది.
అయితే థర్డ్ అంపైర్ మాత్రం దానిని ఔట్‌గా ప్రకటించాడు.దీంతో డుప్లెసిస్‌తో పాటు ఆర్సీబీ అటగాళ్లు, అభిమానులు షాక్‌లో ఉండిపోయారు. బ్యాట్ క్రీజులో ఉన్నా కూడా అలా ఎలా ఔట్ ఇస్తాడంటూ అంపైర్‌ని తిట్టిపోస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ప్లేఆఫ్స్‌కి వెళ్లింది కాబట్టి పెద్దగా రచ్చ చేయడం లేదు కాని, ఓడిపోయి ఉంటే మాత్రం డుప్లెసిస్ ఔట్ డిస్కషన్ పాయింట్‌గా మారి ఉండేది.
Mitchell Santner dismissed Virat Kohli and ran out Faf Du Plessis at the non striker’s end.
– A great spell from Santner!pic.twitter.com/CwYo5fPI6t
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024