Ms Dhoni| ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ 49వ మ్యాచ్ చెపాక్ వేదికగా జరిగింది. టాస్ ఓడిన చెన్నై ముందుగా బ్యాటింగ్ చేసింది. చెన్నైకి అజింక్యా రహానే, రుతురాజ్ శుభారంభం అందించారు కాని పెద్ద స్కోరుగా మలచకలేకపోయారు. రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లతో 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీ చేయగా.. అజింక్యా రహానే(24 బంతుల్లో 5 ఫోర్లతో 29) మాత్రమే విలువైన పరుగులు చేశారు. గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ వల్లనే సీఎస్కే 162 పరుగుల స్కోరును చేరుకోగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై వికెట్స్ వెంటవెంటనే పడిపోతుండడంతో అభిమానులు మరోసారి ధోని బ్యాటింగ్‌ను ఆస్వాదించగలిగారు.
అయితే ఈ మ్యాచ్‌లో ధోని పెద్దగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఇక ఆయన చేసిన పని అభిమానులకి ఆగ్రహం తెప్పిస్తుంది. ఇంతకు ధోని చేసిన పని ఏంటంటే.. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో డారిల్ మిచెల్-ధోని క్రీజులో ఉండి బ్యాటింగ్ చేస్తున్నారు. స్ట్రైకింగ్‌లో ఉన్న ధోని ఓవర్ తొలి బంతికి బౌండరీ కొట్టాడు. ఇక రెండో బంతికి గట్టి షాట్ కొట్టిన కూడా అది బౌండరీకి వెళ్లలేదు. అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న డారిల్ మిచెల్ సింగిల్ కోసం అవతలిక్రీజు వరకు వెళ్లాడు. కాని ధోని అతనిని తిరిగి వెనక్కి పంపించాడు. డారెల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అయిన కూడా అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వక ధోనినే ఓవర్ మొత్తం ఆడాడు. ఆ ఓవర్‌లో ఒక్క సిక్సర్ తప్ప ధోని పెద్దగా పరుగులు రాబట్టింది లేదు.
అయితే డారెల్ మిచెల్‌కి స్ట్రైకింగ్ ఇవ్వకుండా మళ్లీ అంతదూరం ఆయనని వెనక్కి పంపించడం అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే చెన్నై విధించిన లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే పంజాబ్ టార్గెట్ ను చేధించింది.జానీ బెయిర్ స్టో(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 46), రీలీ రోసౌ(23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) అద్భుతమైన బ్యాటింగ్ చేయగా.. శశాంక్ సింగ్(25 నాటౌట్), సామ్ కరణ్(26 నాటౌట్) నెమ్మదిగా ఆడిన తమ జట్టుకి మంచి విజయాన్ని అందించగలిగారు. ఇక చెన్నై బౌలర్లలో శివమ్ దూబే, రిచర్డ్ గ్లీసన్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.