Monday, December 30, 2024
HomeNationalBus Fire Accident | బస్సులో చెలరేగిన మంటలు.. ఎనిమిది మంది భక్తుల సజీవ దహనం..!

Bus Fire Accident | బస్సులో చెలరేగిన మంటలు.. ఎనిమిది మంది భక్తుల సజీవ దహనం..!

Bus Fire Accident | హర్యాణాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకున్నది. తవడు సబ్‌ డివిజన్‌ సరిహద్దు గుండా కుండ్లీ-మనేసర్‌-పాల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపే పర్యాటకులతో వెళ్తున్న బస్సు శనివారం అర్ధరాత్రి మంటల్లో చిక్కుకున్నది. ఈ ఘటనలో ఎనిమిది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పోలీసులకు సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతులు చండీగఢ్‌ వాసులు కాగా.. మధుర, బృందావనం సందర్శించి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, టూరిస్ట్‌ బస్‌ను అద్దెకు తీసుకొని బనారస్‌, మధుర బృందావన్‌కు బయలుదేరామని.. బాధితులు తెలిపారు. బస్సులో మహిళలు, పిల్లలు సహా 60 మంది ఉన్నారని చెప్పారు. పంజాబ్‌లోని లూథియానా, హోషిపూర్‌, చండీగఢ్‌లోని నివాసులని.. వారంతా దగ్గరి బంధువులమేనని తెలిపారు.

తిరిగి స్వస్థలానికి వెళ్తున్న సమయంలో రాత్రి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో బస్సులో మంటలు చెలరేగాయని.. బస్సును ఆపాలని కేకలు వేసినా ఆగలేదని.. మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న యువకుడు వెంబడించి మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని డ్రైవర్‌కు చెప్పాడని స్థానికులు తెలిపారు. ఆ తర్వాత గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యం కావడంతో బస్సు తీవ్రంగా తీవ్రంగా కాలిపోయిందని.. ఎనిమిది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం ఎస్పీ నరేంద్ర బిజారానియా సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. అయితే, బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు.

RELATED ARTICLES

తాజా వార్తలు