Wednesday, April 2, 2025
HomeCinemaRajanikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా షూటింగ్ లో అగ్నిప్రమాదం

Rajanikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా షూటింగ్ లో అగ్నిప్రమాదం

జ‌న‌ప‌దం, విశాఖపట్నం

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajanikanth) కూలీ సినిమా షూటింగ్ లో అగ్నిప్రమాదం జ‌రిగింది. బీచ్ రోడ్‌లో ఉన్న కంటెయినర్ టెర్మినల్‌లో చెలరేగిన మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపుచేస్తున్నారు.

చైనా నుంచి లిథియం బ్యాటరీల లోడ్‌తో గత నెల 28న విశాఖ పోర్టుకి కంటెయినర్ షిప్ వ‌చ్చింది. ఆ కంటెయినర్ టెర్మినల్‌ లో ప్రమాదం సంభ‌వించిన‌ట్టు తెలుస్తుంది.

రజనీకాంత్ కూలీ సినిమా యూనిట్ ఈ ప్ర‌మాదం నుండి తృటిలో త‌ప్పించుకుంది.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న కూలీ సినిమా ప్ర‌స్తుతం విశాఖప‌ట్నంలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమా 2025లో విడుద‌లకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌లో తెలుగు హీరో అక్కినేని నాగార్జున‌, శృతి హాస‌న్, రెబ్బ మోనికా జాన్, స‌త్య‌రాజ్, శివ‌కార్తికేయ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు