Sunday, December 29, 2024
HomeTelanganaBhuvanagiri | డీజిల్ కోసం పెట్రెల్ బంక్‌కు వ‌చ్చిన లారీ.. ట్యాంక్‌లో చెల‌రేగిన మంట‌లు

Bhuvanagiri | డీజిల్ కోసం పెట్రెల్ బంక్‌కు వ‌చ్చిన లారీ.. ట్యాంక్‌లో చెల‌రేగిన మంట‌లు

భువ‌న‌గిరి: యాదాద్రి జిల్లా కేంద్రం భువ‌న‌గిరిలో (Bhuvanagiri) పెను ప్ర‌మాదం త‌ప్పింది. డీజిల్ కోసం పెట్రోల్​ బంక్​కు వచ్చిన లారీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది ఆందోళ‌న‌కు గుర‌య్యారు. భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలోని రిల‌య‌న్స్ బంక్ వద్ద‌కు డీజిల్ నింపుకోవ‌డానికి ఓ లారీ వ‌చ్చింది. సిబ్బంది డీజిల్​ నింపడానికి సిద్ధమవుతుండ‌గా లారీ ట్యాంక్​ నుంచి మంటలు వచ్చాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే లారీ ఇంజిన్​ నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభ‌మైంది.

ఒక్కసారిగా భయాందోళనలకు గురైన పెట్రోల్​బంకు సిబ్బంది వెంటనే తేరుకుని అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఊహించని పరిణమానికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

 

 

RELATED ARTICLES

తాజా వార్తలు