Encounter | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకులు గర్జించాయి. నారాయణ్‌పుర్ – దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లోని గోబెల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.
గోబెల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులు ఐటీబీపీ పోలీసులతో కలిసి కూంబింగ్ చేపట్టారు. మొత్తానికి మావోయిస్టులను చుట్టుముట్టి పోలీసులు కాల్పులు జరిపారు.
తాజా ఎన్‌కౌంటర్‌తో కలిసి గతేడాది కాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 122 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మే 23న నారాయణ్‌పూర్ – బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మే 10న ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో 12 మంది మృతి చెందారు.