Realme 12 Pro plus | స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఈ ఏడాది ప్రారంభంలో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చిన రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్ మొబైల్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తున్నది. ప్రముఖ ఈ-కామర్స్ వైబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే మొబైల్‌ను అందుబాటులో ఉంచింది. రియల్ మీ 12 ప్లస్ మొబైల్ మూడు స్టోరేజీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8జీబీ ర్యామ్+128జీబీ, 256జీబీ, 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ వేరియంట్లు ఉండగా.. బేస్ వేరియంట్ ధర రూ. 29,999కే అందుబాటులో ఉంది. మిగతా రెండు వేరియంట్లు వరుసగా రూ.31,999, రూ.33,999గా నిర్ణయించంది. ఈ మొబైల్స్ కొనుగోలుపై రూ.3వేల వరకు బ్యాంక్ తగ్గింపు ఆఫర్ ఉన్నది. దాంతో బేస్ వేరియెంట్ రూ.26,999కే సొంతం చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఎక్స్ఛేంజ్‌పై రూ.3వేల వరకు ఆఫర్ లభించనున్నది.
రియల్‌మీ ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్
రియల్‌మీ 12ప్రో ప్లస్ 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0పై పని చేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 120హెడ్‌జ్ రిఫ్రెష్ రేటుతో వస్తోంది. 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్‌తో వస్తోంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉండగా.. 24జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకునే వీలుంటుంది. రియర్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్‌తో వస్తుంది. 64 ఎంపీ ఓమ్నీ విజన్ OV64B సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ 120X డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో వస్తోంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో వస్తుంది. దాంతో ఇది 48 నిమిషాల్లోనే 0-100 శాతం బ్యాటరీని ఛార్జ్ అవుతుంది.