JanaPadham-09-08-2024 E-Paper
బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ కన్నుమూత
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య(80) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల న్యూమోనియా సోకడంతో లైఫ్ సపోర్టుపై ఉంటూ వస్తున్నారు. గురువారం ఉదయం కోల్ కతాలోని పామ్ అవెన్యూలో తుది శ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
ఆయన 2000 సంవత్సరం నుండి 2011 వరకు 11 ఏళ్ళపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
బెంగాల్ లో 34 సంవత్సరాలు వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నడపగా.. అందులో చివరి సీఎంగా బుద్దదేవ్ విధులు చేపట్టారు. ఆయన ఐదు దశాబ్దాల పాటు రాజకీయాలలో కొనసాగారు. అయితే, 2011 లో జరిగిన ఎన్నికలలో బుద్దదేవ్ ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమితో బెంగాల్ లో 34 సంవత్సరాల సీపీఐ(ఎం) పాలన ముగిసింది.