Lok Sabha Elections | హైదరాబాద్ : నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తెలంగాణలో 17, ఏపీలో 25, ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లో 8, బీహార్‌లో 5, ఒడిశా, జార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్మూకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకు గానూ ఇంతవరకు మూడు దశల్లో 283 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. నాలుగో దశలోని 96 స్థానాలను కలిపితే ఆ సంఖ్య 379కి చేరుకోనుంది.
బరిలో ఉన్న ప్రముఖులు వీరే..
తెలంగాణ నుంచి బోయిన్‌పల్లి వినోద్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, ఈటల రాజేందర్, మాధవీలత, డీకే అరుణ ఉన్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, ఝాన్సీ లక్ష్మి బొత్స, కేశినేని నాని, వైఎస్ షర్మిల, దగ్గుబాటి పురంధేశ్వరి, విజయసాయి రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి,
కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, రావు సాహెబ్ దాన్వే, నిత్యానంద రాయ్, అజయ్ మిశ్రా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, తృణమూల్ ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా, తృణమూల్ నాయకులు శత్రుఘ్న సిన్హా, యూసుఫ్ పఠాన్, కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఉన్నారు.