ఫిరాయింపులకు నేను వ్యతిరేకం: స్పీకర్ గడ్డం ప్రసాద్
-
బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేస్తే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా
-
ఓ పార్టీ నుంచి గెలిచినవ్యక్తి ఆ పార్టీకే అండగా ఉండాలి
-
పాడి కౌశిక్‌రెడ్డి విజిటర్‌గా వచ్చి దానంపై ఫిర్యాదుచేశారు
-
ఆ పిటిషన్‌పై అతి త్వరలో నిర్ణయం తీసుకుంటా\
-
ఓ చానల్ ఇంటర్వ్యూలో స్పీకర్ గడ్డం ప్రసాద్
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ స్పష్టంచేశారు. స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా తన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విజిటర్‌గా వచ్చి దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారని, త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల జరుగుతున్న పార్టీ ఫిరాయింపులను ఎలా చూస్తారు అని ప్రశ్నించగా.. ‘పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఓ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఆ పార్టీకే అండగా ఉండాలని భావించే వ్యక్తిని నేను.