Gambhir| టీ20 వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ పదవి నుండి తప్పుకోనున్నారు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. అయితే కేకేఆర్ మెంటార్ గంభీర్‌ని హెడ్ కోచ్‌గా నియమించే ఆలోచన బీసీసీఐ చేస్తుందని, ప్రకటనే తరువాయి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్.. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మెంటార్‌గానే తాను కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌ను సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలబెట్టడమే తన లక్ష్యమని, ఆ ప్రయాణం ఇప్పుడే మొదలైందని చెప్పాడు. సక్సెస్ ఫుల్ టీమ్‌గా నిలిచేందుకు తాము ఇంకా మూడు టైటిల్స్ గెలవాల్సిన అవసరం ఉందని అన్నాడు.
ఐపీఎల్ ముగియడంతో నా కుటుంబంతో వెకేషన్ వెళ్లాలనుకుంటున్నా. క్రికెట్‌లో కొనసాగాలంటే ఇలాంటి బ్రేక్ తీసుకోవడం ఎంతైన అవసరం. కుటుంబంతో గడపడం కన్నా మించిన ఆనందం మరొకటి లేదు అని అన్నారు. మాకు ‘ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కన్నా రెండు టైటిల్స్ మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఈ గెలుపుతో సంతృప్తిగానే ఉన్నాను. అయితే ఇంకా మేము మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ కాదు. అలా నిలవాలంటే మేం ఇంకా మూడు టైటిళ్లు గెలవాల్సిన అవసరం అంది, అందుకు చాలా కష్టపడాలి అని గంభీర్ స్పష్టం చేశాడు.
ఒకవేళ టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ అయితే మాత్రం భారత టీ20 జట్టుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరమవుతారని సమాచారం. అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే చివరి అవకాశం. ఈ టీ20 ప్రపంచకప్‌తో ఇద్దరు ఆటగాళ్ల టీ20 అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడనుందని,ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను భారత టీ20 జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోరని తెలుస్తుంది. మరి రానున్న రోజులలో భారత హెడ్ కోచ్ విషయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.