Geethanjali| ఒకప్పుడు తన అందచందాలతో కుర్రాళ్లని ఓ ఊపు ఊపిన అందాల భామలు ఇప్పుడు గుర్తు పట్టకుండా మారిపోతున్నారు. సోషల్ మీడియా వచ్చాక వారి ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో వారిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘ గీతాంజలి ‘ మూవీ హీరోయిన్ ఇప్పటి లుక్ చూసి అందరు అవాక్కవుతున్నారు. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెలుగులో తీసిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవిలో వస్తే మంచి ఆదరణ లభిస్తుంది. ట్రాజెడీ లవ్ స్టోరీ మ్యూజిక్ పరంగా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది.
చిత్రంలో హీరోయిన్ గా నటించిన గిరిజ శెట్టర్ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆమె నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆమె ఎనర్జీ, యాటిట్యూడ్ అప్పటి కుర్రకారు గుండెల్లో బాణాల్లా గుచ్చుకుపోయేలా చేసింది. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అనే ఫీల్ అందరిలో కలిగించింది. చిత్రంలో నాగార్జున – గిరిజ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులు ఇప్పటికీ ఫ్రెష్ గా ఫీలవుతుంటారు. లేచి పోదామన్న మొనగాడా… అంటూ గిరిజ నాగార్జునతో చెప్పే డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంది. ‘ గీతాంజలి ‘ సినిమా విడుదలై 25 ఏళ్ళు కావడంతో ఇందులో నటించిన గిరిజ .. ఇప్పుడు ఎక్కడ ఉందో? ఏం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె మెడిటేషన్ టీచర్ గా తన కెరీర్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది.. లా గ్రేస్ శ్రీ అరబిందో ఇంటిగ్రల్ లైఫ్ సెంటర్ పేరుతో మెడిటేషన్ క్లాసెస్ చెబుతుంది. 2003లో యోగా, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మనస్తత్వ శాస్త్రంలో డాక్టరల్ థీసెస్ పూర్తి చేసింది. ఆమె తెలుగులో 2002లో హృదయాంజలి సినిమా చేయగా, ఆ తర్వాత మలయాళంలో రెండు చిత్రాలు చేసింది. ఇందులో ఒకటి రిలీజ్ కాలేదు. హిందీలో రెండు చిత్రాలు చేసింది. 2003లో పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.