రసభాసగా జీహెచ్ఎంసీ సమావేశం
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో పెద్ద ఎత్తున రభస చోటు చేసుకుంది. అంతుకు ముందు ప్రధాన కార్యాలయం వద్ద నుంచే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ముందు ఫ్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేసుకున్నారు. ఆ తరువాత సమావేశం ప్రారంభమయ్యాక కూడా రచ్చ కొనసాగింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియంను చుట్టుముట్టారు.