హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో (Inter Results) ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్మీయట్ భవన్‌లో విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,87,261 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం పరీక్ష రాసినవారిలో 60.01 శాతం ఉత్తీర్ణత నమోదయింది. సెకండియర్‌లో 3,22,432 మంది పాసవగా 64.19 శాతం ఉత్తీర్ణత రికార్డయింది. ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా టాప్ ప్లేస్‌లో నిలవగా మేడ్చల్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు మొదటి స్థానంలో నిలిచింది. విద్యార్థులు ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/లో చెక్ చేసుకోవచ్చు.
కాగా, ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలుర కన్నా.. బాలికలే అధిక ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో బాలికల ఉత్తీర్ణత శాతం 68.59గా ఉంటే.. బాలురు 53.36 శాతం.. సెకండియర్‌లో బాలికలు 75.71 శాతం, అబ్బాయిలు 62.92 శాతంగా నమోదయింది.
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 9,80,978 మంది విద్యార్థులు రాశారు. గురువారం నుంచి మే 2 వరకు రీవెరిఫికేషన్, రివాల్యుయేషన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.