Gold Price | ఇటీవల కాలంలో బంగారం ధరలు, పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఏ రోజు ధరలు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. అంతర్జాతీయంగా జరిగే కీలక పరిణామాలు, పలు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులతో డాలర్‌లో మార్పులు చేర్పులు చోటు చేసుకుటున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రభావం పసిడి, వెండి ధరలపై పడుతున్నది. పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతుండడంతో గతకొంతకాలంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
తాజాగా బుధవారం మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అక్షయ తృతీయకు ముందుగా కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. దాంతో బంగారం కొనుగోలు భారీగానే జరిగే అవకాశాలున్నాయి. బుధవారం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గింది. అదే సమయంలో వెండి ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.66,150కి పతనమైంది. 24 క్యారెట్ల స్వర్ణం రూ.72,160కి తగ్గింది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,160కి పతనమైంది. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,310కి తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌రూ.72,160కి దిగివచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంతో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు అమలవుతున్నాయి. ఇక వెండి ధర రూ.200 పెరిగింది. దాంతో ఢిల్లీలో కిలో వెండి ధరరూ.85,200కి పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.88,700కి ఎగిసింది.