న్యూఢిల్లీ: తగ్గినట్లే తగ్గిన బంగారం ధర (Gold Price) మళ్లీ పెరిగింది. గతకొన్నిరోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మునుపెన్నడూ లేనట్లుగా రూ.75 వేల మార్కుకి చేరాయి. దీంతో పుత్తడిని కొనాలంటేనే సామాన్యులు భయపడిపోతున్నారు. అయితే పెరుగుతూ పోతున్న బంగారం ధరలకు మంగళవారం కాస్త బ్రేక్ పడింది. తులం బంగారంపై ఏకంగా రూ.1,400 తగ్గిన విషయం తెలిసిందే. దీంతో కాస్తా ఊపిరి పీల్చుకున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఇంకా తగ్గుతాయనుకున్న ధరాలు మళ్లీ పెరిగాయి.
బుధవారం తులం బంగారానికి రూ.450 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,600గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,650 వద్ద కొనసాగుతున్నది. మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. బుధవారం కిలో వెండిపై రూ.100 తగ్గింది. నేడు బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.82,900గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 82,900గా ఉంది. చెన్నైలో రూ.86,400 వద్ద వెండి ధర కొనసాగుతున్నది. బెంగళూరులో కిలో వెండి రూ.82,500గా ఉండగా.. హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో రూ.86,400గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- హైదరాబాద్- 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
- విజయవాడ- 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
- విశాఖపట్నం- 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650
- న్యూఢిల్లీ- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,800
- ముంబై- 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650
- చెన్నై- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420
- కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.66,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650గా ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650