Sunday, December 29, 2024
HomeBusinessFlipkart | నిధుల సమీకరణలో ఫ్లిప్‌కార్ట్‌..! పెట్టుబడులు పెట్టబోతున్న గూగుల్‌..!

Flipkart | నిధుల సమీకరణలో ఫ్లిప్‌కార్ట్‌..! పెట్టుబడులు పెట్టబోతున్న గూగుల్‌..!

Flipkart | సెర్చింజన్‌ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకున్నది. వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఈ కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్డ్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ చేపడుతున్న ఫండింగ్ రౌండ్‌లో పెట్టుబడులు పెట్టాలని గూగుల్ యోచిస్తున్నది. ఈ మేరకు గూగుల్‌ ప్రతిపాదనలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. గూగుల్ పెట్టుబడుల ప్రతిపాదన ప్రస్తుతం నియంత్రణ సంస్థల పరిధిలో ఉందని.. దీనికి వేర్వేరు దశల్లో ఆమోదం లభించాలని ఉందని చెప్పింది.

గూగుల్ ఎంత మొత్తంలో పెట్టుబడులకు ప్రతిపాదన చేసింది?.. ఫ్లిప్‌కార్ట్ ఎంత మొత్తం నిధులు సమీకరించబోతోందనే విషయాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. తాజా నిధుల సమీకరణలో భాగంగా టెక్‌ దిగ్గజాన్ని వాటాదారుగా చేర్చుకోబోతున్నట్లుగా ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. గూగుల్ ప్రతిపాదనకు నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉందని ఓ ప్రకటనలో పేర్కొంది. పెట్టుబడితో పాటు ‘క్లౌడ్’ సహకారం అందించేందుకు సైతం గూగుల్ సిద్ధంగా ఉందని, ఫ్లిప్‌కార్ట్ వ్యాపార విస్తరణకు ఈ ఒప్పందం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్‌ చెప్పుకొచ్చింది.

దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరిన్ని సేవలు అందించేందుకు డిజిటల్ సదుపాయాలను ఆధునికీకరించుకునేందుకు అవకాశం దక్కనుందని ఫ్లిప్‌కార్డ్‌ వెల్లడించింది. కాగా, ఫ్లిప్‌కార్ట్ సుమారు 350 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించే అవకాశం ఉందని సమాచారం. అయితే, గూగుల్‌ ఎంత పెట్టుబడి పెడుతుందనే విషయం మాత్రం తెలియరాలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు