Saturday, December 28, 2024
HomeSpiritualTirupati | సింహవాహనంపై కటాక్షించిన గోవిందరాజస్వామి..

Tirupati | సింహవాహనంపై కటాక్షించిన గోవిందరాజస్వామి..

Tirupati | తిరుపతి గోవింద రాజస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన శనివారం గోవిందరాజస్వామి సింహవాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా.. భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మృగాల్లో రారాజు సింహం. గాంభీర్యానికి చిహ్నం సింహం.

యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. స్వామివారు రాక్షసుల మనసులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది. అనంతరం ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. వాహ‌న‌సేవ‌లో పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్‌ మోహన రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ధనుంజయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు