హైదరాబాద్: గ్రూప్-4 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను టీఎస్‌పీఎస్సీ (TSPSC) వెల్లడించింది. నియమాలకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను త్వరలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9న విడుదల చేసిన విషయం తెలిసిందే. జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో పిలవనున్నారు.
కమ్యూనిటీ, నాన్ క్రిమి లేయర్(బీసీలకు), పీడబ్ల్యూడీ సర్టిఫికెట్స్, స్టడీ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్స్(క్లాస్ 1 నుంచి ఏడు వరకు), రిజర్వేషన్ కలిగి ఉంటే దానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఏజ్ రిలాక్సేషన్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు రెడీగా ఉంచుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో వీటిలో ఏ డాక్యుమెంట్ సమర్పించకపోయినా ఆ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 ఉద్యోగాల భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది జూలై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 7,62,872 మంది పేపర్ -1 పరీక్ష రాయగా, 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. ఫలితాలను ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ఇందులో భాగంగా 7,26,837 మంది ర్యాంకులను ప్రకటించింది. తాజాగా ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది.