Saturday, January 4, 2025
HomeTelanganaHarish Rao | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దంపతుల స్మారక సమావేశానికి హాజరైన మాజీ...

Harish Rao | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దంపతుల స్మారక సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు

మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దంపతుల స్మారక సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు.

హరీష్ రావు కామెంట్స్ :

తెలంగాణ ఉద్యమం కాలంలో పాల్వాయి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఉద్యమమే అనేక సందర్భాల్లో కలిపేది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అధికార పార్టీలో ఉంటూ బలమైన వాదన వినిపించిన నాయకుడు.

నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ లాయాలిస్ట్ గా పని చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాజశేఖర్ రెడ్డి గారి కి భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, అధికార పార్టీలో ఉండి కూడా తెలంగాణకు పూర్తి మద్దతు పలికారు.

ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు సేవ చేశారు.

ఉద్యమకాలంలో చాలా ఆప్యాయంగా దగ్గర కూర్చోబెట్టుకొని వారి సూచనలు సలహాలు ఇచ్చేవారు.

2004లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుకు క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు.

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు అంటే కెసిఆర్ గారికి ఎంతో గౌరవం.

వారు చనిపోయినప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో తెలంగాణకు తీసుకువచ్చి అధికార లాంచనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించారు.

వారి ఆశయాలను వారి కుటుంబ సభ్యులు కొనసాగించాలని ఆశిస్తున్నాను.

RELATED ARTICLES

తాజా వార్తలు