మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జగిత్యాల జిల్లా లోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని గురువారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు ఆలయ అర్చకులు హరీష్ రావును సంప్రదాయ పద్దతి లో స్వాగతించారు. వేద మంత్రాలతో ఆశీర్వదించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు పూజలో పాల్గొన్నారు.