మాజీ మంత్రి హరీష్ రావు భూపాలపల్లి జిల్లా కమలాపూర్‌లో ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్ –
🔹 ఎన్నికల ముందు రూ. 500 రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేడు మాట మార్చింది
🔹బాండ్ పేపర్ మీద రాసిచ్చి బోగస్ చేశారు.. వంద రోజుల్లో చేస్తానన్న హామీలు దిక్కు లేకుండా పోయాయి
🔹ఎన్నికల ముందు సన్నాలకు మాత్రమే ఇస్తామని ఉంటే, ప్రజలు తగిన బుద్ధి చెప్పేవారు
🔹వడ్లల్లో రాళ్ళు ఏరినట్లు మిమ్మల్ని ఏరి పారేసేవారు
🔹మంత్రులు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు
🔹రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అని ఒకరు అంటే, బోనస్ గురించి అడిగితే రైతులను కుక్కలతో పోల్చుతున్నారు
🔹రైతులను అవమానపరచడం సరికాదు
🔹రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అసెంబ్లీని స్తంభింపచేస్తాం
🔹రైతుల కోసం ఎంత దూరమైన కొట్లాడుతాం.. అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేదాకా పోరాటం చేస్తాం
🔹కేసీఆర్ గారు ఇచ్చినట్లుగానే ఈ జూన్ నెలలోనే ఎకరాకు రూ. 7,500 రైతుభరోసా ఇవ్వాలి
🔹రైతులకు పచ్చిరొట్ట విత్తనం అందించలేని పరిస్థితి
🔹హైదరాబాద్‌లో కూర్చోవడం కాదు రైతుల కళ్ళలో కన్నీళ్లు చూడండి
🔹మల్లికాంబనే రైతు కళ్ళల్లో నీళ్లు చూస్తే హృదయం ద్రవీభవించింది
🔹హార్ట్ పేషెంట్ అయ్యుండి 15 రోజుల నుండి ఎండలో ఉంటూ వడ్లను ఆరబెట్టింది
🔹రాత్రి వర్షం పడడంతో పంట మొత్తం తడిసింది నా పరిస్థితి ఏమిటని దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్నది
🔹రాష్ట్రంలో రైతులందరూ ఆందోళనలో ఉన్నారు.. క్వింటాలకు మూడు కిలోలు తరుగు పెడుతున్నారు
🔹మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
🔹యుద్ధ ప్రాతిపదికన తడిసిన వడ్లను కొనుగోలు చేయాలి అని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.