రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ:
పెద్దలు, ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సిద్దిపేట జిల్లా వాసుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
గూడవెల్లి, హల్దీల్లో పంటలు ఎండిపోయినయి. కేసీఆర్ బస్సు యాత్ర చేయగానే నీళ్లు వచ్చినయి.
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని ఆంధ్రా నాయకులు అంటున్నారు.
కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష.
రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ లేదు.
బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో పై భాగంలో జై తెలంగాణ, జైజై తెలంగాణ కచ్చితంగా ఉండేది.
ఆరోజు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేదించారు. ఇప్పుడు రేవంత్ పాలనతో తెలంగాణ పదం మాయమైంది.
కేసఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారు.
తెలంగాణ హక్కుల కోసం ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్.
రేవంత్ ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కావొచ్చు,సీఎం కావొచ్చు.కానీ ఉద్యమకారుడు కాలేడు.
తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు తప్ప ఉద్యమకారుడు కాలేడు.
ఉద్యమకారులన్న ఘనత మనకు దక్కుతుంది. కరెంట్ కోసం రాజీవ్ రహదారిని దిగ్బంధం చేశాం. ఎన్నో త్యాగాలు, పోరాటాలు ఉన్నాయి.
అరెస్టయినా, జైల్లో ఉన్నా బాధపడింది లేదు, భయపడిందిలేదు.
ఈ పోరాటంలో పాల్గొన్నఅందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు