Sunday, December 29, 2024
HomeUncategorizedHarish Rao: విద్యార్థి నాయకుల అరెస్టును ఖండిస్తున్నా: హ‌రీశ్ రావు

Harish Rao: విద్యార్థి నాయకుల అరెస్టును ఖండిస్తున్నా: హ‌రీశ్ రావు

“గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ను పరామర్శించేందుకు వెళ్తున్న బిఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కారించాల్సింది పోయి, పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికం. ఇదేనా మీ ప్రజా పాలన? ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన నాయకులకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావడం లేదు. అక్రమ అరెస్టులు చేసిన వారిని తక్షణం వదిలిపెట్టాలని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తున్నాం.” అని హరీష్ రావు తన x ఖాతాలో పోస్ట్ చేసారు.

RELATED ARTICLES

తాజా వార్తలు