తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం
హైడ్రా పేరుతో రాజకీయ కుట్ర
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో 65 వేల కోట్ల అప్పు చేసింది.
ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేయబోయే అప్పు 4 లక్షల 87 వేల 500 కోట్లు.
రుణమాఫీ పై మంత్రులు తలా తోక లేని మాటలు మాట్లాడుతున్నారు
వెంటనే రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలి
జ్వరాలతో రాష్ట్రం అతలాకుతం అవుతోంది
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది
…………………………….
తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం.
హరీష్ రావు కామెంట్స్:
విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు
ప్రతి ఇంటిలో ఇద్దరు జ్వరంతో బాధ పడుతున్నారు.
ప్రభుత్వం మాత్రం ప్రజల్ని పట్టించుకోవటం లేదు.
ప్రభుత్వం ప్రత్యర్థులపై విషంచిమ్మే ప్రయత్నం చేస్తోంది
విష జ్వరాలపై పత్రికల్లో పతాకశీర్షికన వార్తలు వస్తున్నాయి.
డెంగ్యూతో మరణించారని రోజు వార్తలు వస్తున్నాయి
పిట్టల్లాగా ప్రజలు రాలిపోతాఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు.
డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో గజగజ లాడుతున్నారు.
లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రయత్నం చేస్తోంది
హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతోంది.
ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని పని చేస్తోంది.
పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు
ప్రజల పక్షాన నిబద్దతగా పని చేసిన వ్యక్తి పల్లా.
కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. లేకపోతే ఇబ్బంది పెడతాం అన్నట్లు రేవంత్ తీరు.
అక్రమకేసులు పెడతాం.. మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధరణితో రేవంత్ ప్రభుత్వం పని చేస్తోంది.
పటాన్ చెరువు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారు
300 కోట్ల ఫైన్ వేసి నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పారు.
కాంగ్రెస్ కండువా కప్పగానే మైనింగ్ కేసు అటకెక్కింది
పల్లా రాజేశ్వర్రెడ్డిని ఇబ్బందిపెట్టేలా అక్రమ కేసులు పెడుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారు
పల్లా రాజేశ్వర్ రెడ్డి భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారు.
మానసికంగా.. పొలిటికల్ గా.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర.
న్యాయం లేకుండా.. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరుతో డ్రామాలు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి కాలేజీ లు ఒక్క ఇంచు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి 24గంటల్లో వరే తొలిగిస్తారు.
మెడికల్ కాలేజీలో ఎంతో మంది వైద్యం పొందుతారు అక్కడ.
అన్ని పర్మిషన్స్ తో కాలేజీ నిర్మించారు
ఉద్దేశయపూర్వకంగా కాలేజీల మీద దాడి చేస్తున్నారు
ఎఫ్టీఎల్ లోకాని..
బఫర్ లో కాని లేదని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ సర్వే రిపోర్ట్ ఇచ్చారు.
813 సర్వేనెంబర్లో ఎలాంటి బఫర్ భూమి లేదని అప్పటి జిల్లా కలెక్టర్ రిపోర్టు ఇచ్చారు.
హెచ్ఎండీఏ పర్మిషన్ తోనే పర్మిషన్ ఉంది
పల్లాపై కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర మాత్రమే.
అక్రమాలను మేం ఎప్పటికీ సమర్థించం
రాజకీయ ప్రేరేపితపై చర్యలను అధికారు ప్రేరేపించటం కరెక్ట్ కాదు.
అధికారం ఉందని రాత్రికిరాత్రే బుల్డోజింగ్ పద్ధతి చేయటం సరికాదు.
అధికారులు అత్యత్సహం పోవద్దు.. అన్ని పరిశీలించండి
రాజకీయ కక్షలను విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రుద్దొద్దు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి టార్గెట్ చేసి సీట్లు పెంచుకొనే అవకాశం ఇవ్వలేదు.
మీడియా సమక్షంలో కొలవండి
ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి.
ప్రభుత్వ ఆసుపత్రులు బెడ్స్ దొరకతలేవు
ప్రైవేట్ ఆసుపత్రులు బెడ్స్ కోసం మాకు ఫోన్ చేస్తున్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే 36శాతం డెంగీ కేసు లు పెరిగాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు
గాంధీ ఆస్పత్రిలో సింపుల్ మెడిసిన్ కూడా అందుబాటులో లేదు.
రివ్యూ చేయాల్సింది ప్రజారోగ్యము పైన
రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసింది.
జ్వరాలతో రాష్ట్రం అతలాకుతం అవుతోంది
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి, ఒక్క డ్రైవ్ తీసుకోవాల్సింది అవసరం.
మంత్రులు రుణమాఫీ పైన కుంతీసాకులు చెప్పుతున్నారు
రుణమాఫీ పైన వైట్ పేపర్ రిలీజ్ చేయండి.
ఇప్పుడేం సాంకేతిక కారణాలు చెప్పుతున్నారు
గతంలో ఎందుకో రాలేదు సాంకేతిక కారణాలు.
ఆర్మూర్ లో రైతులు భారీ ధర్నా చేపట్టారు,రైతులే రైతు సంఘాలే రోడ్ మీదుకు వచ్చి ఆందోళన చేస్తున్నాయి.
డైవరషన్ పాలిటిక్స్ చేయడం రేవంత్ రెడ్డికి బాగా అలవాటు అయింది.
రుణమాఫీపై పెట్టిన గడువులన్నీ జోక్ అయ్యాయి
ప్లానింగ్ లేక కుంటిసాకులు చెబుతున్నరు.
తక్షణమే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
మేము 72వేలు కోట్ల రూపాయలు రైతుబంధు ఇచ్చాము.
30 వేల కోట్లు రుణమాఫీ చేశాం.
అప్పులు పేర్లు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది.
అలివికాని హామీలు ఇచ్చి గత ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు .
ఎనిమిది నెలల్లో 65 వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
అంటే నెలకు 8125 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేస్తుంది.
అంటే ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేయబోయే అప్పు 4 లక్షల 87 వేల 500 కోట్లు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలలో నాలుగు లక్షల 26000 వేల కోట్లు అప్పు మాత్రమే చేసింది.
FRBM కింద 42,118 కోట్లు అప్పు చేసింది. వివిధ కార్పొరేషన్ల నుండి 22, 840 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం.
ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం 65 వేల కోట్లు.
రేవంత్ రెడ్డి నీకు అప్పులు గురించి మాట్లాడే హక్కు ఉందా.
ఆస్తుల కల్పన చేశాం, అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించాం
ఉప ముఖ్యమంత్రి అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు
అడ్డగోలు హామీలు ఇచ్చి..నెరవేర్చలేక బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నరు.
పరిపాలనంతా ఆగమాగం చేశార
పంచాయతీ సెక్రెటరీలు మాస్ లీవ్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నరు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు ఇవ్వలేదు
గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ అటకెక్కింది
సమస్యల వలయంలో రాష్ట్రం ఉంటే..రాజకీయ కుట్రలకే పరిమితమవుతున్నరు.