Saturday, December 28, 2024
HomeTelanganaHarish Rao | ముఖ్యమంత్రివా..? చెడ్డీ గ్యాంగ్‌ సభ్యుడివా..? రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్‌

Harish Rao | ముఖ్యమంత్రివా..? చెడ్డీ గ్యాంగ్‌ సభ్యుడివా..? రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్‌

Harish Rao | మాజీ ముఖ్యమంతి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించడమేంటని ఆయన ధ్వజమెత్తారు. ‘నువ్వు ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్‌ సభ్యుడివా’ అంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు సిరిసిల్ల పర్యటనలో కేసీఆర్‌ రైతుల కష్టాలను చూసి చలించిపోయారన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలను ఆయ వేదికపై డిమాండ్‌ చేశారన్నారు.

రూ.500 వడ్లకు బోనస్‌ ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అమలు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారని హరీశ్‌రావు తెలిపారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర పదజాలంతో కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారనంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ చెడ్డీ ఊడగొడతానని రేవంత్ రెడ్డి అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు పదేళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్‌పై ఇలాంటి భాష ఉపయోగిస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు