Sunday, December 29, 2024
HomeTelanganaరుణమాఫీ హామీపై మాట తప్పిన సిఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు...

రుణమాఫీ హామీపై మాట తప్పిన సిఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం

జనపదం – శుక్రవారం – 16-08-2024 E- Paper

రుణమాఫీ హామీపై మాట తప్పిన సిఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం

• రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేడు అనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుచుకుంటున్నాడు.
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు.
• అబద్దం కూడా సిగ్గుపడి మూసి దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన.
• దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బిఆర్ఎస్ మీద నామీద అవాకులు చెవాకులు పేలాడు.
• అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తాన్నన్నది రేవంత్ రెడ్డే.
• అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు.
• ఆగస్టు 15తేదీ వరకు 31వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టిండు. అంటే 9వేల కోట్లు కోత పెట్టిండు.
• అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసిండు.
• సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం అనే విధంగా నగ్నంగా తన నిజస్వరూపాన్ని ఈ రోజు బట్టబయలు చేసుకున్నడు.
• మేము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యింది.
• కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా, 17,869 కోట్లు మాత్రమే అవుతాయా?
• ఈ ఒక్కవిషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతున్నది.
• మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దుంకి ఎవరు చావాలి?
• నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బిఆర్ఎస్ ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు.
• రేవంత్ రెడ్డి నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డావు.
• రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి నువ్వు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
• కాని నీకు ఆ సంస్కారం లేదు. నీలో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదు.
• ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, నువ్వు చేసిన పాపఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్నాను
• ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు గాను, దైవ ద్రోహానికి గాను తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా.
• ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పండో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో నేనే స్వయంగా పోతా. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తాను.

RELATED ARTICLES

తాజా వార్తలు