జనపదం – శుక్రవారం -23-08-2024 E-Paper
జర్నలిస్టులపై దాడిని ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
సిఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చిన సరిత, విజయ రెడ్డి అనే జర్నలిస్టుల నుండి కెమెరాలు గుంజుకొని, భౌతిక దాడికి పాల్పడటం దుర్మార్గం.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నది. ప్రశ్నించే హక్కులను కాలరాస్తున్నారు. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సమాజ హితాన్ని కాంక్షించే జర్నలిస్టుల పట్ల దాడులు పెరిగిపోతుండటం ఆందోళనకరం. జర్నలిస్టుల దాడుల పట్ల ప్రజాస్వామికవాదులు స్పందించాలి.
జర్నలిస్టులు సరిత, విజయ రెడ్డిలతో ఫోన్ లో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు వారి యోగక్షేమాలు, దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.