Wednesday, January 8, 2025
HomeTelanganaHarish Rao | బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Harish Rao | బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

అప్పుడు గోడలు దూకడం కాదు..
ఇప్పుడు వెళ్లి సమస్యలు పరిష్కరించు..
విద్యార్థుల భవిష్యత్ కాదు.. రేవంత్ భవిష్యత్ బంగారమైంది..
బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
మాజీ మంత్రి హరీశ్ రావు
జనపదం, నిజామాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచార యావ కోసం ట్రాక్టర్ లో వెళ్లి, కాలేజీ గోడ దూకి నానాయాగి చేసిండని, ఇప్పుడు అధికారంలో ఉంటే కనీసం విద్యార్థులపై కన్నెత్తి చూడడం లేదు. బంగారు బాటలు వేస్తామంటూ భ్రమింపజేశాడని, ఆయన మాత్రం ముఖ్యమంత్రి అయి ఆయన భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకున్నాడని, విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
చీమకుట్టినట్లు లేదు..
బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించడంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విఫలం అయ్యాడని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని ఒకవైపు గురుకుల విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే, ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పూర్తిస్థాయి వీసీ నియామకం, నిధుల గోల్ మాల్, మెస్ కాంట్రాక్టులలో పారదర్శకత, సిబ్బంది నియామకాలు, ఆరోగ్య సేవల మెరుగుదల, ఫుడ్ కోర్టు టెండర్ సమీక్ష, ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల పెంపు వంటి 17 డిమాండ్లతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాలుగు రోజులుగా నిరసనలు తెలియజేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు.
ప్రజాపాలనలో విద్యావ్యవస్థ ధ్వంసం
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీకి వెళ్లి సమస్యలు పరిష్కరించారని, కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే సమస్యలు మళ్లీ మొదలయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోడలు దూకి వెళ్లడం కాదని, ఇప్పుడు సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ నేరుగా వెళ్లి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నతమైన ట్రిపుల్ ఐటీ వరకు మీ 9 నెలల పాలనలో ధ్వంసం కాని విద్యావ్యవస్థ ఇంకేమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రజా పాలనలో టీచర్లు లేక 1800 పాఠశాలలు మూతపడ్డాయని చెప్పారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించడంతో పాటు, విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు