Friday, December 27, 2024
HomeTelanganaKhammam | రాష్ట్రం అల్లకల్లోలం.. ఖ‌మ్మం జిల్లా మంత్రుల‌పై హ‌రీశ్‌రావు ఫైర్

Khammam | రాష్ట్రం అల్లకల్లోలం.. ఖ‌మ్మం జిల్లా మంత్రుల‌పై హ‌రీశ్‌రావు ఫైర్

రాష్ట్రం అల్లకల్లోలం…

ఖమ్మం ను ఖతం పట్టిస్తున్నరు.
9 మందిని గెలిపిస్తే..
3 ల‌క్ష‌ల ఎక‌రాలు ఎండ‌బెడుతారా..?
కూల్చివేతలలేనా ..
పూడ్చివేతలుండవ

ఖ‌మ్మం జిల్లా మంత్రుల‌పై హ‌రీశ్‌రావు ఫైర్

హైద‌రాబాద్ :

రాష్ట్రాన్ని అల్లా కలవడం మారుతున్నారని మాజీ మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేసి మంత్రులు ఆటాడుకుంటున్నారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో కూల్చేతులే తప్ప మరోటి లేదన్నారు. ఖమ్మం జిల్లా వరద బాధిత ప్రాంతాలపై రాష్ట్ర చిత్గతులపై మాజీ మంత్రి హరీష్ తెలంగాణ భవన్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా అనేక అంశాలు ఆయన ప్రస్తావించారు. దేశంలోనే అత్య‌ధికంగా వ‌రి పండించే పంజాబ్, హ‌ర్యానా రాష్ట్రాల‌కు ధీటుగా తెలంగాణ‌ను అగ్ర‌భాగాన నిలిపామని చెప్పారు. కానీ నేడు ఆ పంట పొలాల్లో క‌రువు క‌రాళ‌నృత్యం చేస్తోంది.. నీళ్లు పోసే రైతు ఎక్కడా అని ఆ పంట పొలాలు రోదిస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. ఒకవైపు కృష్ణానది నిండు కుండలా ఉంది.. సాగర్‌లో నీరున్న పంటలన్నీ ఎండిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌లాపున సముద్రం ఉన్న‌ చేప పిల్లలు నీటి కేడ్చినట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప‌ని తీరు అని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. ప‌దేండ్ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా పూడ్చివేతల గురించి తెలియ‌దా..? అని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల సంభ‌వించిన వ‌ర‌దకు న‌ష్ట‌పోయిన రైతుల‌కు ఎకరాకు రూ. 25 వేలు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున డిమాండ్ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

22 రోజులైనా గండి పూడ్చాల‌ని సోయి లేదా..?

పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రైతులు ఎన్ఎస్పీ ఆఫీసులను రైతులు ముట్టడిస్తున్నారు. పార్టీలకతీతంగా ధర్నా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్న‌ద‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. గతేడాది నీరు లేక పొలాలు ఎండిపోయాయి. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉండి కూడా గండిపడిన కాల్వ పక్క నుంచే వెళ్తున్నారు. 22 రోజులైనా గండిపూడ్చాలని సోయిలేదా. ఆకాశాన్ని దించుతాం, సూర్యుని వంచుతాం అనే డైలాగులు కొడుతున్న రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు.. కాల్వ గండి పూడ్చాడం చేతకాదా? అని నిల‌దీశారు.

క‌న్నీళ్లు పెట్టిస్తున్న కాంగ్రెస్ స‌ర్కార్..

హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం వచ్చుగానీ.. రైతులకు నీరు ఇవ్వడం రాదా? కాంగ్రెస్‌కు రైతుల పట్ల జాలి, దయ లేదా..? అని ప్ర‌శ్నించారు. వరదల్లో కొట్టుకుపోయిన పంటలకు నష్టం పరిహారం ఇవ్వరా..? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు కన్నీళ్లు తూడ్చడం కాదు.. కన్నీళ్లు పెట్టిస్తుంది. ఎకరాకు రూ. 25 వేలు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వరద నష్టం వల్ల సాగర్ పరివాహ‌క ప్రాంతాల్లో 60వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకం వల్ల మ‌రో లక్ష ఎకరాలు న‌ష్ట పోయినట్లు ప్రాథమిక అంచనాలో తేలింద‌న్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నీరు ఇచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితులు లేవు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వ‌ట్లేదు..?

ఆగస్టు 15వ తేదీన‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో సీతారామ‌ ప్రాజెక్టు ప్రారంభించి, సీఎం, మంత్రులు డైలాగులు కొట్టారు. 70 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్నారు. మ‌రి సీతారామ‌ ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదు..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామస్వామి మీద ఒట్టు పెట్టి.. మాట తప్పారు. దేవుడా రామచంద్రస్వామి ముఖ్యమంత్రిని క్షమించు, ఖమ్మం జిల్లా రైతులను కాపాడు. ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేశారు. 9 మందిని గెలిపిచడం వాళ్లు చేసిన త‌ప్పా..? అని ప్ర‌శ్నించారు.

దాడుల‌కు భ‌య‌ప‌డం.. రైతుల‌కు మ‌నోధైర్యం చెబుతాం..

బీఆర్ఎస్ పార్టీ తరుపున మేం ఖమ్మం జిల్లాకు వెళ్తాం.. రైతులకు మనోధైర్యం చెబుతాం అని హ‌రీశ్‌రావు హామీ ఇచ్చారు. ట్యాంకర్లు, జనరేటర్లు పెట్టుకొని పంటలు తడుపుకొంటున్నారు. దాడులకు బీఆర్ఎస్ ఏనాడు భయప‌డ‌లేదు. వరద బాధితులను పరామర్శించేందుకు మాపై దాడులు చేసిండ్రు.. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. పోలీసులు అతి ఉత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూసాం. పోలీసు అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలి ప్రభుత్వాలకు లోబడి కాద‌న్నారు. ప్రభుత్వ వైఫల్యాల‌ను డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో హైడ్రామా చేస్తున్నాడ‌ని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోతుంటే, లక్షల మంది డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విష‌జ్వ‌రాల‌తో బాధపడుతున్నారు. అయినా సీఎం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

రేవంత్ పాల‌న‌లో అత్యాచారాలు నిత్య‌కృత్యం..

రాష్ట్రంలో గుండాయిజం పెరిగిపోయింది.. అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని హ‌రీశ్‌రావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో రెండు వేల అత్యాచారాలు జరిగాయి. హైదరాబాద్, దేవరకద్రలో నిన్న ఒక రోజే రెండు అత్యాచారాలు జరిగాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిపై ఇంటిపై నిన్న రాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఈ దాడికి బాధ్యత వహించాలి. రాత్రిపూట ఇంటి ముందు పటాకులు పేల్చి, తలుపులు తీయించి మరీ దాడులు చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. పోలీసులు పట్టించుకోవడం లేదు.. దాడికి పాల్పడిన వారిపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు