కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో భూమి కోల్పోయిన కిష్టయ్య అనే రైతు ఆత్మహత్యా యత్నం చేశారు. ప్రాణాపాయ స్థితిలో గజ్వేల్ ఆర్విఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
హరీష్ రావు కామెంట్స్ :
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను, రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నది.
కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా పేదరైతుల భూముల మీద దాడులు చేస్తున్నారు.
రైతులపై విపరీతమైన అక్రమాలు,దౌర్జన్యాలు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోయాయి.
ఇలాంటి ఒక సంఘటనే సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామంలో కూడా జరిగింది.
బండి కిష్టయ్య అనే పేద రైతు తన భూమి హద్దులు చూపించాలని సర్వే కోసం అప్లై చేస్తే. అక్కడికి వచ్చిన డిఐ ముందు సర్వే చేసి సరిహద్దులు పెట్టారు.
ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు అందరి ముందే అధికారికి ఫోన్ చేసి వారిపై ఒత్తిడి తెచ్చి రెండోసారి సర్వే చేయించారు.
రెండోసారి సర్వే చేస్తే హద్దులన్నీ మార్చేసి ఆ రైతు పొలానికి దారి లేకుండా చేశారు. రైతును తీవ్ర ఇబ్బందులు పెట్టారు.
రైతు నుంచి 20 లక్షల రూపాయలు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్లో రైతుపై కేసు పెట్టి వేధించి భయభ్రాంతులకు గురి చేస్తే ఆందోళన గురైన కిష్టయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతు కుటుంబంతో మాట్లాడినప్పుడు వారిని 20 లక్షల రూపాయలు అడిగారని చెప్తున్నారు.
కాంగ్రెస్ పెద్దల అండదండలు మాకు ఉన్నాయని, మీరు ఎక్కడికి వెళ్లినా మీకు న్యాయం జరగదు అని చెప్పారు.
కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యం, విపరీత చర్యల వల్ల అధికారులపై ఒత్తిడి తెచ్చి రైతు భూమి హద్దులు మార్చడం వల్ల కిష్టయ్య ఆత్మహత్యా యత్నం చేశారు.
జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరిపించాలని హద్దులు మార్చిన డిఐపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నాం.
అధికారుల పై ఒత్తిడి తెచ్చిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి.
ముందు సర్వే చేసిన విధంగానే భూమికి హద్దులు పెట్టి కిష్టయ్య భూమిని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం.
ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు ఈ సంఘటనపై దృష్టి పెట్టాలని, ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగకుండా చూడాలని, కిష్టయ్యకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా ఆపాలి.
పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపి రైతు భూమిని వారికి దక్కే విధంగా రెవెన్యూ శాఖ మంత్రి, ముఖ్య మంత్రి చర్యలు తీసుకోవాలి.