పదిహేనేండ్లుగా జన జీవన స్రవంతి లో ఉంటున్న సింగరేణి ఉద్యమ నాయకుడు, రచయిత మహ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మానవ హక్కులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. తక్షణమే డీజీపీ ఈ వ్యవహారం పై స్పందించి హుస్సేన్ ఆచూకీ పై ప్రకటన చేయాలి. ప్రజా పాలన అని చెప్పుకుంటూ అక్రమ నిర్బంధాలు ,అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు. హుస్సేన్ ప్రాణాలకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాలి అని హరీష్ రావు తన ‘x’ ఖాతాలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.