బీఆర్‌ఎస్ నమ్ముకున్నది కార్యకర్తలు, ప్రజలను మాత్రమే.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్లిపోయినా బీఆర్‌ఎస్‌కు పోయేదేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైఎస్ హయాంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు. అప్పుడు కూడా బీఆర్‌ఎస్ పని అయిపోయిందని అన్నారని చెప్పారు. కానీ బీఆర్‌ఎస్‌కు ఏమీ కాలేదని, ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు.
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. మహిపాల్‌రెడ్డిని మూడుసార్లు ఎమ్మెల్యేను చేసిందని గుర్తు చేశారు. గూడెం వెళ్లిపోయినా.. బీఆర్‌ఎస్ కార్యకర్తలు గుండె ధైర్యంతో ఉన్నారని అన్నారు. బీఆర్‌ఎస్ నమ్ముకున్నది కార్యకర్తలను, ప్రజలను మాత్రమే అని స్పష్టం చేశారు. పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టామన్నా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డే ఇప్పుడు వివక్ష ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని అన్నారు.
కాగా, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరటం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా పటాన్‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన మహిపాల్‌రెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీముఖ్యం గా కాంగ్రెస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. అందుకే మహిపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక కార్యక్రమానికి కాటా శ్రీనివాస్‌గౌడ్ దూరంగా ఉన్నారు. కాటా వర్గానికి చెందిన నాయకులు బాహాటంగానే మహిపాల్‌రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై కాటా, మహిపాల్‌రెడ్డి అనుచరుల మధ్య సోషల్ మీడియా వేదికగా రెండురోజులుగా వార్ కొనసాగుతున్నది.