సిద్దిపేట: బీరప్ప దేవుని దయవల్ల సిద్దిపేట ప్రాంతం సస్యశ్యామలం అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేది కాదని చెప్పారు. సిద్దిపేట జిల్లా తొర్నాల గ్రామంలో కొనసాగుతున్న బీరప్ప జాతరలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీరప్పకు ప్రత్యేక పూజలు చేశారు. హరీశ్‌రావును ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం బీరప్ప జాతరకు వచ్చిన జనాలతో ఆయన ముచ్చటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీరప్ప దేవుని దయ వల్ల సిద్దిపేట ప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు. మన కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా.. తెలంగాణ రాకపోత సిద్దిపేట జిల్లా అయ్యేదా.. అని అడిగారు. సిద్దిపేటకు మెడికల్ కాలేజీ వచ్చింది. రైలు వచ్చింది. గోదావరి జలాలు వచ్చాయని గుర్తు చేశారు. బీరప్ప దేవుని ఆశీస్సులతో అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాని చెప్పారు.