సిద్దిపేట క్యాంప్ కార్యాలయం నుండి ఖమ్మం, మహబూబాబాద్ వరద బాధితులకు సహాయార్థం నిత్యావసర సరకులు వాహనాలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు..
– ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ…
– ఖమ్మం మహబూబాబాద్ లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది..
– సిద్దిపేట నుండి ఉడుత భక్తిగా సహాయం చేస్తున్నాం.
– మానవ సేవయే మాధవ సేవ అని అందురూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలి.
– సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది..
– రాష్ట్రంలో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన నడుస్తుంది..
– ముందుగా ప్రభుత్వం మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండే..
– బి ఆర్ ఎస్ ఎంఎల్ఏ లు ఎంపీ లు ఎంఎల్ సి ల నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నాం..
– మా తరహాలో బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలి..
– మేము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారు..
– అక్కడి ప్రజలు ప్రభుత్వం పై దుమ్మూ ఎత్తి పోశారు.
– సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు.
– మాకు వస్తున్న స్పందన ను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారు..
– బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేక పోయారు
– ఇండ్లు నీళ్లలో మునిగి పోయిన వారికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి