Sunday, December 29, 2024
HomeHealthGuava | ఏ జామ కాయ బెట‌ర్..! తెల్ల జామ‌నా..? ఎర్ర జామనా..?

Guava | ఏ జామ కాయ బెట‌ర్..! తెల్ల జామ‌నా..? ఎర్ర జామనా..?

Guava | అన్ని సీజ‌న్స్‌లో దొరికే జామ‌పండును పేద‌వాడి యాపిల్‌గా అభివ‌ర్ణిస్తారు. యాపిల్‌లో ఎలాంటి పోష‌కాలు ల‌భిస్తాయో.. జామ‌లో కూడా అన్ని పోష‌కాలు ల‌భిస్తాయి. యాపిల్‌తో పోల్చితే.. జామ పండు ఖ‌రీదు కూడా త‌క్కువే. కాబ‌ట్టి యాపిల్ పండు తిన‌లేని వారు జామ‌పండు తింటే స‌రిపోతుంది. అన్ని సీజ‌న్స్‌లో విరివిగా ల‌భించే ఈ జామ పండులో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి తెల్ల జామ‌.. మ‌రొక‌టి ఎర్ర జామ‌. అయితే ఈ రెండింటిలో ఏదీ బెట‌ర్ అంటే.. ఎర్ర జామ‌నే బెట‌ర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మ‌రి ఎర్ర‌జామ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి ఎక్కువ

ఎర్ర జామ తినేవారిలో రోగ నిరోధ‌క శ‌క్తి అధికంగా ఉంటుంది. విట‌మిన్ సీ, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో వ్యాధుల‌ను కూడా ద‌రి చేరనీయ‌దు ఎర్ర జామ‌. ముఖ్యంగా సీజ‌నల్ వ్యాధుల నుంచి ఎర్ర జామ కాపాడుతుంది.

దీర్ఘ‌కాలిక వ్యాధుల నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం

రోజుకో ఎర్ర జామ పండును తిన‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలిక వ్యాధుల నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందే అవ‌కాశం ఉంటుంది. ఎర్ర జామలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఐరన్ లోపం తలెత్తదు. అంతే కాకుండా రక్త హీనత సమస్య అదుపులోకి వస్తుంది. దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు చెక్ పెట్టిన‌ట్టు అవుతుంది. అలాగే ఎర్ర జామ తినడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

మధుమేహం ఉన్న‌వారు మితంగా తీసుకోవాలి..

జామ కాయ నేచురల్‌గా స్వీట్ నెర్ కాబట్టి.. డయాబెటీస్ ఉన్న వారు ఈ పండును ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చు. అయితే మితంగా తీసుకోవాలి. ఇది తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

చర్మం కాంతివంతం..

ఎర్ర జామ కాయ తిన‌డం వ‌ల్ల చర్మంపై మచ్చలు, ముడతలు రాకుండా చూస్తుంది. క్రమం తప్పకుండా జామ పండు తింటే చర్మ సమస్యలు దూరం అవుతాయి. చర్మాన్ని కాంతివంతంగా చూస్తుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు