Wednesday, January 1, 2025
HomeHealthHealth Tips | బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా..? ఈ ఫుడ్ తీసుకుంటే బెట‌ర్..!

Health Tips | బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా..? ఈ ఫుడ్ తీసుకుంటే బెట‌ర్..!

Health Tips | చాలా మంది బ‌రువు త‌గ్గేందుకు చాలా క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. వాకింగ్‌కు వెళ్తుంటారు. జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తుంటారు. కానీ బ‌రువు త‌గ్గ‌రు. అలా అధిక బ‌రువుతో బాధ‌ప‌డేవారు తీసుకునే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటిస్తే స‌రిపోతుంది. జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. స‌హజంగా దొరికే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అసలు బరువు తగ్గడంలో ప్రోటీన్ ఫుడ్స్ ఎలా హెల్ప్ చేస్తాయంటే.. ఇవి శరీరంలో జీవక్రియను పెంచుతాయి. మెటబాలీజం పెరిగి.. కేలరీలు బర్న్ చేస్తాయి. కాబట్టి బరువు తగ్గుతారు. అయితే ప్రోటీన్ కోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పప్పులు

బ‌రువులు త‌గ్గాల‌నుకునే వారు మాంసాహారానికి దూరంగా ఉంటారు. అలాంట‌ప్పుడు వారికి ప్రోటీన్స్ అంద‌డం క‌ష్టం. మ‌రి ప్రోటీన్ అందాలంటే ప‌ప్పులు తినాలి. ప‌ప్పుల్లో ప్రోటీన్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. ప‌ప్పుల్లో మాంసకృతులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటిలో కొవ్వు కూడా తక్కువగా ఉంటాయి. కేలరీలు కూడా తక్కువే. ఇవి బరువు తగ్గడానికి మంచి ఎంపిక. ఎక్కువ కేలరీలు లేకుండా ప్రోటీన్​లతో నిండి ఉంటాయి. ఫైబర్ కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

గుడ్లు

ఇక గుడ్ల‌లో కూడా ప్రోటీన్ పుష్క‌లంగా ఉంటుంది. గుడ్లు పూర్తిగా మిన‌ర‌ల్స్, విట‌మిన్లు, మాంస‌కృతులతో నిండి ఉంటాయి. అందుకే గుడ్ల‌ను బ్రేక్ ఫాస్ట్‌లోనే ఆర‌గిస్తుంటారు. ఇవి జీవక్రియను పెంచి.. రోజంతా ఆకలిని నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. దీనివల్ల కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. కాబట్టి వీటిని వెజిటేబుల్ సలాడ్స్​తో లేదా ఆమ్లెట్లు లేదా బాయిల్ చేసుకుని తీసుకోవచ్చు. కొందరు వెజిటేరియన్స్​ కూడా ప్రోటీన్​ కోసం ఎగ్స్​ తీసుకుంటారు.

పెరుగు

పెరుగు​లో ప్రోటీన్​, ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో దోహ‌దం చేస్తాయి. సాధారణ పెరుగు కంటే గ్రీక్ యోగర్ట్​లో చక్కెరలు తక్కువగా ఉంటాయి. పైగా ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దీనిని మీరు స్నాక్స్​గా తీసుకోవచ్చు. స్మూతీలు, సలాడ్స్​లో కూడా దీనిని కలుపుకోవచ్చు.

సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​తో పాటు.. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలో ప్రోటీన్ మెటబాలీజంను పెంచి.. కొలెస్ట్రాల్​ను కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా వీటిని మీ డైట్​లో చేర్చుకోవచ్చు.

RELATED ARTICLES

తాజా వార్తలు