అమరావతి: రాష్ట్రంలో ఎండలు (Summer) దంచికొడుతున్నాయి. భానుడి భగభగకు వడగాల్పులు తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో రికార్డు స్థాయిలో 47.1 డిగ్రీల ఉష్ట్రోగతలు నమోదయ్యాయి. మరో నాలుగు జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు (Heat Wave) వీస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో కూడా వడాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు.
శుక్రవారం ఏపీలోని 28 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 156 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇక శనివారంనాడు 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 261 వడగాల్పులు వీచే అవకాశం శ్రీకాకుళం 4, విజయనగరం 10, మన్యం జిల్లాలోని 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీస్తాయని చెప్పారు.
రేపు ఈ మండలాల్లో వడగాల్పులు
శ్రీకాకుళం జిల్లాలోని 10, విజయనగరం జిల్లాలోని 12, పార్వతీపురంమన్యం 10, అల్లూరిసీతారామరాజు 10, అనకాపల్లి 11, కాకినాడ 7, తూర్పుగోదావరి 4, ఏలూరు 3, కృష్ణా 2, ఎన్టీఆర్ 11, గుంటూరు 9, పల్నాడు 26, బాపట్ల 3, ప్రకాశం 23, నెల్లూరు 13, నంద్యాల 1, అనంతపురం 1, అన్నమయ్య 2, తిరుపతి జిల్లాలోని 7 చొప్పున మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. ఒకవేళ బయటకు వెళ్లినా ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు,టవల్, కాటన్ దుస్తుల ధరించడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.