Monday, December 30, 2024
HomeNationalBengaluru | బెంగళూరును ముంచెత్తిన వాన..! హర్షం వ్యక్తం చేసిన నగర వాసులు

Bengaluru | బెంగళూరును ముంచెత్తిన వాన..! హర్షం వ్యక్తం చేసిన నగర వాసులు

Bengaluru | ఇటీవల నీటి కరువుతో అల్లాడిన బెంగళూరు నగరంలో ఆకస్మిక వాన ముంచెత్తింది. దాదాపు ఐదారు నెలల తర్వాత వర్షం కురవడంతో బెంగళూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎండలు, ఉక్కపోత నుంచి స్వల్ప ఊరట కలిగింది. ఈ క్రమంలో బెంగళూరు వాసులు వాన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పలువురు వర్షం నీటిని ఒడిసిపట్టుకున్నారు. నీటిని వృథా కానీయకుండా ఇంకుడు గుంతుల్లోకి పంపుతున్న వీడియోలను షేర్‌ చేయడం కనిపించింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు వర్షం కురిసిందని.. ఎండల వేడి నుంచి కొంత ఊరటనిచ్చింది.. దాంతో క్యాంపస్ లోని మా వాలంటీర్లు ఆనందాన్ని పట్టలేకపోయారని.. వర్షంలో కేరింతలు కొట్టారని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా వివరించింది.

ప్రకృతి పునరుద్ధరణ సంకేతం ఎంతో ఊరటను, ఆశను కలిగిస్తోందని.. ఇక చల్లని రోజులు వస్తాయనే హామీ ఇస్తోంది పోస్ట్‌ చేసింది. ఇదిలా ఉండగా.. పలువురు యూజర్లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా వర్షాలు లేకపోయినా డ్రైనేజీలు, నాలలను శుభ్రం చేయకుండా నిద్రపోయారాంటూ మండిపడ్డారు. రోడ్లపై నీరు నిలువడంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. మరికొందరమో నగరంలో భిన్న పరిస్థితులపై స్పందించారు. నగరంలో వర్షాలు కురవకపోతే జనం అల్లాడుతున్నారని.. వర్షాలు కురిస్తే నిలిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి ఇదేనా? అంటూ పలువురు యూజర్లు ప్రశ్నించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు