తెలంగాణలో వర్ష భీబత్సం
తెలంగాణను వానలు కొద్ది రోజులుగా అతలాకుతలం చేస్తున్నయి. వానల వల్ల రోజు వారీ పనులకు ఆటంకం కలుగుతున్నది. భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా కలిగింది.
పిడుగు పడి ములుగు జిల్లాలో ఒక గొర్రెల కాపరి మరణించాడు.
వానల మూలంగా పలు ప్రాంతాలు జలమయం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్త మైంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీచేసింది. వచ్చే రెండు రోజులలో నదులు భారీగా పొంగిపొరలే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది.
అల్ప పీడనం సెప్టెంబర్ ఒకటవ తేదీ ఉదయం ఉత్తరాంద్ర, దక్షిణ ఒడిశా కోస్తా ప్రాంతంలోని కళింగ పట్నం దాటింది. ఇది క్రమంగా వాయవ్యం వైపు కదులుతూ, తెలంగాణ, ఒడిశా ఛత్తీస్ గఢ్ వైపు చేరుకోవచ్చునని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణ పేట్, జోగిలాంబ గద్వాల జిల్లాలకు సెప్టెంబర్ ఒకటవ తేదీ నాడు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.