Friday, January 3, 2025
HomeCinemaHema| రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ న‌టి హేమ‌.. ఇంకా ఎవ‌రెవ‌రు దొరికారంటే..!

Hema| రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ న‌టి హేమ‌.. ఇంకా ఎవ‌రెవ‌రు దొరికారంటే..!

Hema| ఆదివారం రోజు రాత్రి బెంగుళూరులోని ఎలెక్ట్రానిక్ సిటీ సమీపంలో జ‌రిగిన రేవ్ పార్టీ క‌ల‌క‌లం రేపుతుంది. హైద‌రాబాద్‌కి చెందిన వ్య‌క్తి ఏర్పాటు చేసిన పార్టీకి టాలీవుడ్ కి చెందిన కొందరు నటీమణులు.. ప్రముఖులు, బడాబాబులు కూడా హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. అయితే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న చోటుకి వెళ్లి రైడ్ చేశారు. రేవ్ పార్టీలో పోలీసులు కొన్ని మాదక ద్రవ్యాలని కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. బర్త్ డే పార్టీ పేరుతో అసాంఘిక కలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే రేవ్ పార్టీలో న‌టి హేమ కూడా ఉంద‌ని వార్త‌లు రాగా, ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్‌ హౌస్‌లో చిల్‌ అవుతున్నాను. నాపై వస్తోన్న వార్తలు నమ్మకండి. ఆ వార్తలో నిజం లేదు. బెంగళూరు ఫామ్‌హౌస్‌లో ఎవరున్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి’’ అని వీడియో ద్వారా తెలిపారు. అయితే హేమ తాను రేవ్ పార్టీలో లేద‌ని చెప్ప‌గా, బెంగ‌ళూరు పోలీసులు మాత్రం ఆమె ఉంద‌ని ఒక ఫోటో కూడా విడుదల చేశారు. పోలీసులకి ప‌ట్టుబ‌డ్డ వారిలో కూడా హేమ ఉంద‌ని అంటున్నారు.

ఇక రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు మోడళ్లు పట్టుబడ్డారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ తీసుకున్నారని ఆదివారం అర్థరాత్రి తర్వాత జరిగిన రైడ్‌లో పోలీసులు గుర్తించారు.. రేవ్‌పార్టీ నిర్వహించిన ఫామ్‌హౌస్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారు ఉండడం ఏపీ అధికార పార్టీని ఉలిక్కిపడేలా చేసింది

RELATED ARTICLES

తాజా వార్తలు