Hema| టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో హేమ కూడా ఒకరు. మూడు దశాబ్దాలకుపైగా తెలుగులో సినిమాలు చేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా లేడీ కమెడియన్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజోలులో జన్మించిన హేమ 1989లో పరిశ్రమలో అడుగు పెట్టింది. ఇక ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా దొరికింది. బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ తనకు అక్కడ లేదు అని బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టడంతో హేమ కథ అడ్డం తిరిగింది. ఎప్పుడంతే రేవ్ పార్టీ న్యూస్ మీడియాలో వచ్చిందో వెంటనే తాను అక్కడ లేను అని హైదరాబాద్ లో ఓ ఫేమ్ హౌస్ లో చిల్ అవుతున్నా అంటూ కథలు అల్లింది. కాని పోలీసులు ఆమెకి ఆధారాలతో సహా నోటీసులు పంపారు
రేవ్ పార్టీ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోంటున్న హేమ.. పోలీస్ విచారణకు కూడా వెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. తనకు జ్వరంగా ఉందని, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విచారణకు హాజరయ్యేందుకు మరో వారం సమయం కావాలని సీసీబీ అధికారులకు హేమ లేఖ రాశారు. ఈ క్రమంలో పోలీసులు జూన్ 1న విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి నోటీసులు జారీ చేశారు. మరి ఆరోజునైనా హేమ విచారణకు వెళ్తుందా , లేక మరేదైనా సాకు చెబుతారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎందుకు హేమ ఈ వివాదాన్ని అనవసరంగా తెగే దాకా లాగుతుంది అని ముచ్చటించుకుంటున్నారు.
పార్టీలో దొరికినవారంతా సైలెంట్‌గా ఉంటే.. ఈమె మాత్రం నేను పార్టీలోనే లేను, హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నానని, బిర్యానీ చేస్తున్నానంటూ వీడియోలు వదిలింది. కుటుంబ సభ్యులకు తాను పోలీసుల కస్టడీలో ఉన్నానని చెప్పమని ఫోన్ ఇస్తే ఇలా చేస్తుందా అంటూ ఆమెపై నెటిజన్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదే కాకుండా తన స్క్రీన్ నేమ్‌ను దాచి అసలు పేరు (కృష్ణవేణి)తో పార్టీలోకి ఎంటరై తెలివిగా వ్యవహరించినట్టు ఫీలైంది. ఎంత కవరింగ్ చేసుకున్నా కూడా బెంగళూరు పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉండటం, పైగా డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడంతో ఇప్పుడు చేసేదేం లేక సైలెంట్ అయింది. రాజకీయ నాయకుల రిఫరెన్స్‌తో ఈ కేసు నుండి బయటపడేలా హేమ ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.