Hema| బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతుంది. రేవ్ పార్టీలో టాలీవుడ్‌కి సంబంధించిన పలువురు తెలుగు ఆర్టిస్ట్‌లు హాజరయ్యారని ప్రచారం జరిగింది .అయితే హేమ, యాంకర్ శ్యామల, శ్రీకాంత్, జానీ మాస్టర్ తమకు ఈ పార్టీతో సంబంధం లేదని అన్నారు. ఆ పార్టీలో లేము అంటూ వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇస్తున్నారు. హేమ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొదట తాను ఓ రిసార్ట్‌లో చిల్ అవుతున్నట్టు వీడియో పోస్ట్ చేసింది. ఆ తర్వాత తను ఇంట్లోనే ఉండి హ్యాపీగా వంట చేసుకుంటున్నట్టు బిర్యానీ తయారు చేస్తున్న ఒక వీడియోను పోస్ట్ చేసింది.
అసలు రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు హేమ మాట్లాడగా, ఇప్పుడు ఆమెకి సంబంధించిన రిపోర్ట్ బయటకు రావడంతో అందరు అవాక్కవుతున్నారు.రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ స్పష్టం చేశారు. ఆమె విడుదల చేసిన వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇక పార్టీలో పాల్గొన్న నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు గుర్తించినట్లుగా సమాచారం. ఈ మేరకు నార్కోటిక్ టీమ్ రిపోర్ట్ సమర్పించింది. పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు వ్యాపార రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. పార్టీలో నిషేధిత డ్రగ్స్ 17 గ్రాముల ఎండీఎంఏతోపాటు గంజాయి, 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
150 మంది రక్త నమూనాలు నార్కోటిక్ టీమ్ సేకరించింది. ఇందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు. అంటే మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్ వ్చచింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. అలానే ఆషీ రాయ్, వాసు, హేమ స్నేహితుడు చిరంజీవి అనే వ్యక్తి శాంపిల్స్ కూడా పాజిటివ్ అయినట్లు నిర్ధారించారు. దీంతో వీరందరికీ పోలీసులు నోటీసులు పంపించారు. హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించే అవకాశం ఉంది. కనుక వీరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. పదేపదే ఆ పార్టీలో ఉంది నేను కాదని చెప్పుకోవడానికి హేమ పడ్డ పాట్లు వృధా అయ్యాయి.