జనపదం -గురువారం -22-08-2024 E-Paper
పార్టీల్లో ఫార్మ్ హౌజ్ ల కల్లోలం
హైడ్రా పై హైడ్రామా
నేతల్లో వణుకు… పార్టీల్లో బెనుకు
కాంగ్రెస్ నేతల ఫాం హౌజ్ ల వద్ద బీఆర్ఎస్ మీడియా షో
హస్తం లీడర్ల ఫాం హౌస్ లు కూల్చరేం – కేటీఆర్
ఆ ఫాం లు కూల్చొద్దని కోర్టుకెక్కిన బీఆర్ఎస్
హైడ్రా రద్దు పై ఒక్కటైన బీజేపీ, ఎంఐఎం
పొంగులేటి సహా మెజార్టీ మంత్రుల వ్యతిరేకం..
అఖిలపక్షంతో కౌంటర్
హైడ్రా… పరిధులేంటని ప్రశ్నించిన హైకోర్టు..
చెరువులు, నాలాలను కబ్జా చేసి దర్జాచేసి భవంతులు నిర్మించుకున్న బడా నేతల భరతం పడుతున్న హైడ్రా రాజకీయ పార్టీలను షేక్ చేస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ గా నియమించడంతో పాటు దాని పరిధిని పెంచి విస్తృత అధికారాలిచ్చారు. దీంతో హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 120 భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రహరీలు కూల్చివేసింది. గండిపేటలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించారు. ఒక్క గండిపేటలోనే 25కి పైగా భవనాలను కూల్చేశారు. చందానగర్ సర్కిల్ మదీనాగూడ చెరువులో 3, బాచుపల్లిలోని ఎర్రకుంటలో 3, గాజులరామారంలో 42 భవనాలను నేలమట్టం చేశారు. ఇక హైడ్రా అదను చేసుకుని చిత్రపురి కాలనీలో అక్రమ కట్టడాలను స్థానిక అధికారులు కూల్చేశారు. హైడ్రా కన్ను శివారు ప్రాంతాల్లోని పార్టీ నేతల ఫాం హౌజ్ లపై దృష్టి పడిందన్న వార్త ప్రచారం జరుగడంతో తేలు కుట్టిన దొంగల్లా పార్టీల నేతలందరూ ఒక్కటవుతున్నారు. ఓ రాజకీయ పార్టీ హైడ్రాపై కోర్టుకెక్కితే సిద్ధాంతాలను పక్కన పెట్టి ఎంఐఎం, బీజేపీలు ఒక్కటై హైడ్రాపై గరంగరం అవుతున్నాయి. ఇక కాంగ్రెస్ మంత్రులు చెరువు గర్భంలో నిర్మాణాలు చేపట్టారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కెమెరాలు ఫాం హౌజ్ ల వద్ద హల్ చల్ చేస్తున్నాయి.
జనపదం, హైదరాబాద్ బ్యూరో
హైడ్రామా..
పార్టీల్లో ఫార్మ్ హౌజ్ ల కల్లోలం
నేతల్లో వణుకు.. పార్టీల్లో బెనుకు
– కాంగ్రెస్ నేతల ఫాం హౌజ్ ల వద్ద బీఆర్ఎస్ మీడియా షో
– కాంగ్రెస్ లీడర్ల ఫాం హౌస్ లు కూల్చరేం – కేటీఆర్
– ఆ ఫాం లు కూల్చొద్దని కోర్టుకెక్కిన గులాబీ..
– హైడ్రా రద్దు పై ఒక్కటైన బీజేపీ, ఎంఐఎం
– హైడ్రాపై పొంగులేటి సహా మెజార్టీ మంత్రుల వ్యతిరేకం
– అఖిలపక్షంతో కౌంటర్
హైడ్రా చుట్టు రాజకీయం ముసురుతోంది. ఆ మాటకొస్తే అధికార పక్షం ఒకవైపు, మిగతా అన్ని పక్షాలు మరోవైపు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. తమ వరకు వచ్చే సరికి అంతా ఆ తాను ముక్కలే అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసిపోతున్నాయి. బీజేపీ, మజ్లిస్ కూడా ఒకే కుత్తికగా హైడ్రాను చెరబడుతున్నాయి. ఫామ్ హౌస్ ల లొల్లి జోలికికొస్తే బాగుండదనే రేంజ్ లో కమిషనర్ కు వార్నింగ్ ఇవ్వడానికి కూడా వెనకాడని తీరుగా తెగింపునకు పాల్పడుతున్నాయి. అంతా శాఖాహారులే అయితే అసలు ఏడబోతంది అన్నట్టుగా నాయకులంతా కబ్జాలను కట్టడి చేయాలనుకుంటున్నవారే అయితే మరి ఈ ఫామ్ హౌజ్ లు ఎక్కడ నుంచి వెలిసినట్టు., చెరువు శిఖాలు, ఎఫ్టీఎల్ పరిధుల్లో నిర్మాణాలు ఎవరు చేసినట్టు అనేది అంతుచిక్కకుండా ఉందని సామాన్యుడు ముక్కున వేలేసుకుంటున్నాడు.
నేతల్లో వణుకు.. పార్టీల్లో బెనుకు
హైడ్రా పనితీరుతో నేతల్లో వణుకు మొదలైంది. ఇన్నాళ్లు అడ్డూ అదుపు లేకుండా చేసిన కబ్జా పర్వాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చే ప్రమాద ఘంటికలు మ్రోగుతుండడంతో అంతా బెదురుతున్నారు. కాలుకాలిన పిల్లిలా ఎవరికి వారుగా పిసుక్కుంటున్నారు. తెలంగాణ రాష్ట్రావిర్భావానికి ముందు, తర్వాత దాదాపు రెండు దశాబ్దాలుగా సాగిన విచ్చలవిడి ఆక్రమణదారులు భయాందోళనకు గురవుతూనే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యంగా ఫోజులు కొడుతున్నారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఎవరి ప్రభుత్వంలో వారు తమ పనిని కానిచ్చుకుని ఇప్పుడు నిజాలు తేల్చే కమిషనర్ రంగంలోకి దిగడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల ఫాం హౌజ్ లను కూల్చే దమ్ముందా అని కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ టీం ప్రశ్నిస్తుంటే., నాకు ఫాం హౌజే లేదన్నట్టుగా బిల్డప్ ఇవ్వడం ఎందుకు అన్నీ అవే తేలుస్తాయి.. హైడ్రా ముందు నిలబడాల్సి వస్తుందిలే.. అని హస్తం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కాగా, హైడ్రాపై మంత్రి పొంగులేటి సహా మెజార్టీ మంత్రుల వ్యతిరేకించడం చర్చనీయాంశం అవుతున్నది. నిజానికి పొంగులేటి ఫాం హౌజ్ ముమ్మాటికి ఎఫ్ టీఎల్ పరిధిలోనే ఉందనే వాదన ఉంది. ఇప్పుడు హైడ్రా రంగప్రవేశంతో దానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉండడంతో తన నిజమైన అభిప్రాయాన్ని బహిరంగంగానే వెల్లగక్కుతూ మంత్రి తన అసలు రూపాన్ని చూపుతున్నారు.
హైడ్రా రద్దు పై ఒక్కటైన బీజేపీ, ఎంఐఎం
మరి ముఖ్యంగా ఉప్పు, నిప్పుల మాదిరిగా ఉండే కమలం, పతంగం ఇప్పుడు హైడ్రా పుణ్యాన ఒక్కటయ్యాయి. భిన్న అభిప్రాయాలు, వేర్వేరు విధానాలు కలిగిన ఈ రెండు పార్టీలు తమ స్వార్థం కోసం మాత్రం ఒక్కటై ఒకే గొంతుకను వినిపిస్తున్నాయి. హైడ్రా విధివిధానాలపై పెదవి విరుస్తూ, పనితీరును ఎక్కిరిస్తూ తమ అక్కసును వెల్లగక్కుతున్నాయ. హైదరాబాద్ లోని చెరువులకు చెర తొలగుతుందన్న కనీసం విచక్షణను కూడా మరిచి ఆ రెండు పార్టీలు ప్రభుత్వ తీరును తప్పుబట్టి తమ నిజస్వరూపాన్ని చూపుతున్నాయి.