Thursday, April 3, 2025
HomeSportsShikhar Dhawan| ఏంటి..మిథాలీ రాజ్‌ని శిఖ‌ర్ ధావ‌న్ పెళ్లి చేసుకోబోతున్నాడా.. క్లారిటీ ఇదే..!

Shikhar Dhawan| ఏంటి..మిథాలీ రాజ్‌ని శిఖ‌ర్ ధావ‌న్ పెళ్లి చేసుకోబోతున్నాడా.. క్లారిటీ ఇదే..!

Shikhar Dhawan| సోష‌ల్ మీడియాలో నిత్యం వంద‌ల కొద్దివార్త‌లు తెగ వైర‌ల్ అవుతుంటాయి. అయితే వాటిలో ఎంత నిజం ఉంద‌నేది తెలియ‌కపోవ‌డంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్‌లో ఉంటారు. కొన్నాళ్లుగా మిథాలీ రాజ్, శిఖ‌ర్ ధావ‌న్ ప్రేమ‌, పెళ్లి వ్య‌వ‌హారంకి సంబంధించి సోష‌ల్ మీడియాలో ప‌లు ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, దానిపై తాజాగా శిఖ‌ర్ స్పందించాడు. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీ.. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకోవ‌డం మ‌నం చూశాం. దేశంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరగడంలో మిథాలీ పాత్ర చాలా ఉంది. ఆమెని చాలా మంది లేడి స‌చిన్‌గా పిలుస్తారు.

మిథాలీని అలా పిలవడం ఆమెకు ఇష్టం లేకున్నా.. క్రికెట్ ప్రేమికులు మాత్రం ఆమెను అలానే గౌరవిస్తారు. 1982 డిసెంబర్ 3న రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో మిథాలీ రాజ్ జన్మించ‌గా, ఆమె కుటుంబం హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ‌డం వ‌ల‌న ప్రాథ‌మిక విద్యాభ్యాసంతో పాటు క్రికెట్ ఓన‌మాలు కూడా ఇక్క‌డే నేర్చుకుంది. ఆంధ్రా టీమ్ తరుపున దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడిన మిథాలీ రాజ్… ఎయిర్ ఇండియా, రైల్వేస్ టీమ్స్‌కు కూడా ప్రాతినిథ్యం వహించింది. హైదరాబాద్ అమ్మాయిగానే ప్రపంచానికి పరిచయం అయిన మిథాలీ రాజ్ 39 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చిన ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. ఎందుకు అనేది ఎవ్వరికీ తెలియని విషయం.

అయితే మాజీ భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్ ను శిఖ‌ర్ ధావ‌న్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తుండ‌గా, దానిపై శిఖ‌ర్ స్పందించ‌డు. తాజాగా ‘ధావన్‌ కరేంగే’ షోలో పాల్గొన్న ధావన్.. అదంతా తప్పుడు ప్రచారమేనన్నాడు. ‘నాపై అనేక తప్పడు ప్రచారాలు జరిగాయి. అందులో ఇదొకటి. మిథాలీ రాజ్‌‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేదు. ప్రేమాయ‌ణం సాగిస్తున్న వార్త‌లు కూడా పూర్తి అవాస్తవం. అవి ఎవ‌రు న‌మ్మోద్దు అని శిఖ‌ర్ ధావ‌న్ స్పష్టం చేశాడు. కాగా, శిఖ‌ర్ ధావ‌న్ ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని 012లో వివాహం చేసుకోగా, వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న 2021లో వారు విడాకులు తీసుకున్నారు

RELATED ARTICLES

తాజా వార్తలు