Sunday, December 29, 2024
HomeSpiritualHoroscope | 07-05-2024 మంగళవారం.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

Horoscope | 07-05-2024 మంగళవారం.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

వృషభం

శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.

మిథునం

మనస్సు చంచలంగా ఉంటుంది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.

కర్కాటకం

ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది.

సింహం

అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

క‌న్య

ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

తుల‌

గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది.

వృశ్చికం

మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు.

ధ‌నుస్సు

రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు వస్తాయి.

మకరం

అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం.

కుంభం

స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు.

మీనం

ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు