Amazon Great Summer Sale | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) మరో బిగ్ సేల్‌తో మన ముందుకు వచ్చింది. ఏటా నిర్వహించే గ్రేట్ సమ్మర్ సేల్ (Great Summer Sale) గురువారం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌లో, స్మార్ట్‌ఫోన్‌లు, ఏసీలు, వంటగది ఉపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌ఫోన్‌లు, దుస్తులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతోసహా అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో వివిధ వర్గాల అనేక ఉత్పత్తులపై వినియోగదారులకు భారీ తగ్గింపు ఆఫర్‌లను అందిస్తున్నది. సేల్ సమయంలో ఫస్ట్ ఆర్డర్‌పై ఫ్రీ డెలివరీతోపాటు వెల్‌కమ్ రివార్డు పేరుతో 20 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నది.
యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్‌మీ, నార్జో, ఐకూ, పోకో, హానర్, టెక్నో వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఇస్తున్నది. ఇక రూ.59,900గా ఉన్న ఐఫోన్ 13ను రూ.48,999కి అందిస్తున్నది. శాంసంగ్ గెలాక్సీ ఎం 15 ఫోన్ రూ.11,999కే లభిస్తున్నది. దీని అసలు ధర రూ. 15,999గా ఉంది.
ఇక ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే అసుస్ వివోక్15ను అనేక డిస్కౌంట్లు, ఆఫర్లతో కలిసి రూ.57,990కి అందిస్తున్నది. దీని అసలు ధర రూ. 80,990. అదేవిధంగా రూ.24,999 ధర ఉన్న 32 అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని రూ.11,999కే కొనుగోలు చేయవచ్చే. ఈ సేల్‌లో అనేక ఏసీలపై డిస్కౌంట్లు కూడా ఇస్తుంది.