– ఒకే కమిషనరేట్‌కు రెండోసారి కమిషనర్‌గా రికార్డు
– నలుగురు ఐపీఎస్‌ల బదిలీ
డీజీపీతో పాటు 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా రాచకొండ కమిషనర్‌గా సుధీర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షిత మూర్తి, ఈస్ట్‌జోన్ డీసీపీగా బాలస్వామి, సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, రాచకొండకు రెండోసారి కమిషనర్‌గా నియమితులై సుధీర్‌బాబు రికార్డు సృష్టించారు. 2023 డిసెంబర్ 12న రాచకొండ కమిషనర్‌గా బదిలీపై వచ్చిన ఆయన 3 నెలల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించారు. శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈసందర్భంగా సుధీర్‌బాబు వెల్లడించారు.