– నత్త నడకన ఏర్పాట్లు
– నేటికీ ఖరారు కాని ఉత్సవ కమిటీ
– ఇన్‌చార్జ్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల కోసం నిరీక్షణ
ఈనెల 9న వైభవంగా జరుగనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంకు సంబంధించిన ఏర్పాట్లు నత్త నడకన కొనసాగుతున్నాయి. ఆలయ అధికారుల అవగాహన లోపం, ప్రజాప్రతినిధుల పట్టింపులేమి వెరసి కల్యాణానికి 15 రోజుల ముందు నుంచే ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు చకచక జరుగాల్సి ఉండగా ఎలాంటి ప్రచారాల ఆర్బాటాలు లేకుండా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్: ఈనెల 9న వైభవంగా జరుగనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంకు సంబంధించిన ఏర్పాట్లు నత్త నడకన కొనసాగుతున్నాయి. ఆలయ అధికారుల అవగాహన లోపం, ప్రజాప్రతినిధుల పట్టింపులేమి వెరసి కల్యాణానికి 15 రోజుల ముందు నుంచే ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు చకచక జరుగాల్సి ఉండగా ఎలాంటి ప్రచారాల ఆర్బాటాలు లేకుండా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాల్సిన వాటర్ వర్క్స్ అధికారులు బుధవారం ప్రారంభించారు. నెమ్మదిగా కొనసాగిస్తూ మురుగు వ్యార్ధాలను రోడ్లపైనే పడవేస్తున్నారు. ఇకపోతే బల్కంపేట ఓళీ క్రాస్ స్కూల్‌కు వెళ్లే రహదారి నుంచి ఎస్‌ఎస్ బేకరీ వరకు మధ్యలో ఉన్న డివైడర్లలోని చెట్ల కొమ్మలను నరికి నడి రోడ్డుకు ఇరువైపులా అడ్డదిడ్డంగా పడవేస్తున్నారు.